- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచినీళ్ల కోసం ఎదురుచూపులు.. రేషన్ షాపు వద్ద నిలబడలేక..!
దిశ, మణుగూరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని జీసీసీ రేషన్ స్టోర్ వద్ద పేద ప్రజలు స్టోర్ బియ్యం కోసం లైన్లో నిలబడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నియోజకవర్గ కో-కన్వీనర్ గురిజాల గోపి అన్నారు. ఆదివారం మండలంలోని జీసీసీ రేషన్ స్టోర్ వద్ద బియ్యం కోసం వచ్చిన పేద ప్రజలు ఎర్రటెండలో మంచి నీటి కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని గమనించిన పినపాక నియోజకవర్గ కో-కన్వీనర్ గురిజాల గోపి వెంటనే మంచినీటి క్యాన్లను తమ కార్యకర్తలతో ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ స్టోర్ వద్ద సరైన సౌకర్యాలు లేక పేదప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రేషన్ బియ్యం ఓటీపీ ద్వారా ప్రజలకు ఇవ్వడం వల్ల చాలా సమయం పడుతోందని, దాని వలన పేదప్రజలు క్యూ లైన్‌లో నిలబడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రటెండలో మంచినీటి కోసం అపసోపాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రేషన్ స్టోర్ల వద్ద ప్రజలకు మంచినీటి సౌకర్యం, కూర్చునేందుకు ఏర్పాట్లను చేయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.