- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారిని దర్శించుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద సీఎం జగన్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు సీఎంలకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద సీఎం జగన్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు సీఎంలకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనంకు ఇరు రాష్ట్రాల సీఎంలు చేరుకున్నారు. లోక కళ్యాణర్ధం కరోనా నేపథ్యంలో టీటీడీ గత మార్చి నెలనుంచి ధన్వంతరి మహా యాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం నిర్వహిస్తోన్న కార్యక్రమంలో ఇరువురు సీఎం పాల్గొన్నారు.
Next Story






