ఈనెల 17న విశాఖకు సీఎం వైఎస్ జగన్ 

by srinivas |
ap cm jagan
X

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 17న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఎన్ఏడీ వద్ద ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అలాగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదే రోజు సాయంత్రం విజయనగరంలో ఒక ఫంక్షన్ లోనూ అలాగే విశాఖలో జరగనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ రిసెప్షన్ లోనూ ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. అనంతరం అదే రోజు సాయంత్రం విశాఖ నుంచి తాడేపల్లికి చేరుకుంటారని సీఎంవో వర్గాలు స్పష్టం చేశాయి.



Next Story

Most Viewed