గాయం కావడంతో ఆస్పత్రికి సీఎం జగన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ,ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. ఇటీవల వ్యాయామం చేస్తుండగా కుడి కాలికి గాయం కావడంతో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తుంది. వైద్యులు కాలికి పరీక్షలు చేసి, స్కానింగ్, జనరల్ చెకప్‌లు నిర్వహించారు. జగన్ దాదాపు రెండు గంటలపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించడంతో శుక్రవారం విద్యాశాఖపై సమీక్ష చేయాల్సి ఉండగా&#8230;.అది కాస్తా [&hellip;]</p>

గాయం కావడంతో ఆస్పత్రికి సీఎం జగన్
X

దిశ,ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. ఇటీవల వ్యాయామం చేస్తుండగా కుడి కాలికి గాయం కావడంతో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తుంది. వైద్యులు కాలికి పరీక్షలు చేసి, స్కానింగ్, జనరల్ చెకప్‌లు నిర్వహించారు. జగన్ దాదాపు రెండు గంటలపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించడంతో శుక్రవారం విద్యాశాఖపై సమీక్ష చేయాల్సి ఉండగా….అది కాస్తా రద్దు చేశారు.

Next Story