TG Rising – 2047: అటాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వొద్దు.. అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు

by Prasad Jukanti |   (  Updated:2025-11-23 11:11:45  IST  )

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు.

TG Rising – 2047: అటాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వొద్దు.. అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: భారత్ ఫ్యూచర్‌ సిటీలో డిసెంబరు 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించే తెలంగాణ రైజింగ్‌-2047 గ్లోబల్‌ సమిట్‌కు (Telangana Rising-2047 Global Summit) అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఈ సమ్మిట్‍కు ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారని, వివిధ దేశాల అంబాసిడర్లు కూడా పాల్గొనే అవకాశం ఉందని అందువల్ల ఇక్కడికి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని సూచించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ఫ్యూచర్ సిటీలో (Bharat Future City) జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.

శాఖల వారీగా ఎంట్రీ:

ఈ సమ్మట్ కు పాస్‍లు లేకుండా ఎవరు ఎంట్రీ కావడానికి వీలు లేదని, సమ్మిట్‍కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వకూడదని సీఎం ఆదేశించారు. శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుందని ఏర్పాట్లను తాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని చెప్పారు. పోలీస్‍లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పార్కింగ్‍కు ఇబ్బంది రావొద్దన్నారు. బందో‍బస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, సమ్మిట్‍కు హాజరయ్యే మీడియా‍కు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

కాగా, రాష్ట్ర భవిష్యత్ చిత్రపటాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సమ్మిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెండు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజు రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, స్కీమ్‍ల వివరాలను ప్రదర్శించనున్నరాు. రెండో రోజు తెంలగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్ కు పారిశ్రామిక వేత్తలు, బడా కంపెనీల ప్రతినిధులు తరలిరానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

Next Story