లెఫ్టినెంట్ గవర్నర్‌ను తొలిగించాలని సీఎం నిరసన

by  |
లెఫ్టినెంట్ గవర్నర్‌ను తొలిగించాలని సీఎం నిరసన
X

పుదుచ్చేరి : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అభివృద్ధికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆటంకంగా మారారని, సంక్షేమ పథకాలకు మోకాలడ్డుతున్నారని ఆరోపిస్తూ సీఎం నారాయణ స్వామి రోడ్డెక్కారు. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌కు కొద్ది దూరంలో మూడు రోజులుగా ధర్నా చేస్తున్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పుదుచ్చేరి చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు సీపీఐ, సీపీఎం నేతలూ పాల్గొన్నారు. కరోనా నిబంధనలను పేర్కొంటూ రాజ్‌భవన్ ఎదురుగా ధర్నాకు అనుమతులు నిరాకరించారు.

రాజ్‌భవన్‌కు సమీపంలోనే నిరసన మొదలుపెట్టారు. కేంద్రం కనుసన్నల్లో నడుస్తూ తమ ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్నారని సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. సంక్రాంతి బహుమానంగా ప్రజలకు రూ. వెయ్యి చొప్పున పంచాలని తాము నిర్ణయిస్తే రూ. 200 మేరకే పంచడానికి అనుమతినిచ్చారని, ఇలా అనేక విషయాల్లో ఆమె జోక్యం పెరుగుతున్నదని పేర్కొన్నారు. మే నెలలో పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనుండటం గమనార్హం.


Next Story

Most Viewed