KCR : కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన వీహెచ్.. అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో..

by Shyam |   (  Updated:2021-05-29 01:21:42  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ :తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతిభవన్‌కు వెళ్లారు. కానీ సీఎం అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్‌ను కలుద్దామంటే అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదని వీహెచ్ ఆరోపించారు. కేసీఆర్ తనకు ఎప్పుడూ అపాయింట్‌మెంట్ ఇవ్వరని, సమస్యలపై సీఎంకు అనేక లేఖలు రాశానన్నారు. అయినా కేసీఆర్‌ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రజల సమస్యలపై తన పోరాటం కొనసాగుతూ ఉంటుందని, కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు రూ.2 [&hellip;]</p>

KCR : కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన వీహెచ్.. అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో..
X

దిశ, వెబ్‌డెస్క్ :తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతిభవన్‌కు వెళ్లారు. కానీ సీఎం అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్‌ను కలుద్దామంటే అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదని వీహెచ్ ఆరోపించారు.

కేసీఆర్ తనకు ఎప్పుడూ అపాయింట్‌మెంట్ ఇవ్వరని, సమస్యలపై సీఎంకు అనేక లేఖలు రాశానన్నారు. అయినా కేసీఆర్‌ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రజల సమస్యలపై తన పోరాటం కొనసాగుతూ ఉంటుందని, కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

CM KCR refuses to give appointment to V.Hanumanthu Rao

Next Story