- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫామ్ హౌస్ టు ప్రగతి భవన్
<p>దిశ, వెబ్‌డెస్క్: మా సీఎం ఎక్కడున్నారు అని వస్తున్న వార్తలకు తెరదించుతూ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఇన్ని రోజులు విమర్శలు చేసిన వారికి సీఎం రాకతో నోళ్లు మూతపడ్డట్టు అయ్యాయి. కాగా, గత కొన్ని రోజులుగా కేసీఆర్ ఫామ్ హౌజ్ కు అంకితమయ్యారన్న వార్తలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో మిస్సింగ్ కేసీఆర్ అంటూ పోస్టర్లు తెగ వైరల్ కావడం గమనార్హం. ఏకంగా హైకోర్టులో మా సీఎం కనబడటం లేదని పిటిషన్ వేయడంతో ఈ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: మా సీఎం ఎక్కడున్నారు అని వస్తున్న వార్తలకు తెరదించుతూ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఇన్ని రోజులు విమర్శలు చేసిన వారికి సీఎం రాకతో నోళ్లు మూతపడ్డట్టు అయ్యాయి. కాగా, గత కొన్ని రోజులుగా కేసీఆర్ ఫామ్ హౌజ్ కు అంకితమయ్యారన్న వార్తలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో మిస్సింగ్ కేసీఆర్ అంటూ పోస్టర్లు తెగ వైరల్ కావడం గమనార్హం. ఏకంగా హైకోర్టులో మా సీఎం కనబడటం లేదని పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.
ఇటువంటి పరిణామాల్లో శనివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ రావడం సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రంలో కరోనా ప్రభావం, అభివృద్ధిపై అధికారులతో చర్చలు జరపనున్నారు. అంతేకాకుండా మరో రెండు రోజుల్లో రైతులతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. తనపై వచ్చిన విమర్శలపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో అన్న విషయం రాష్ఠ్రంలో హాట్ టాపిక్‌గా మారింది.






