మంత్రి ఎర్రబెల్లిని ప్రశంసించిన సీఎం కేసీఆర్

41

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. సోమవారం రాష్ట్రంలో పలు కీలక అంశాలపై చ‌ర్చించేందుకు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు హాజ‌ర‌య్యారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, వైద్యారోగ్య, విద్య, అటవీశాఖలతోపాటు ఇతరశాఖల ముఖ్యమైన అంశాలపై సమావేశంలో కీలకంగా చ‌ర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో అమలు అవుతున్న పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు ఏర్పాటుపై మంత్రి సంబంధిత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. అధికారులు, సర్పంచ్‌ల సమన్వయం బాగుందని కేసీఆర్ కితాబు ఇచ్చారు.