- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతుచిక్కని మహమ్మారి.. కరోనాపై కేసీఆర్ చేతులెత్తేశారా..?
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ సంక్లిష్టంగా మారిందని, ఇది ఎప్పటికైనా అంతుచిక్కని సమస్యే అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా నివారణకు నిర్ధిష్టమైన అవగాహన కరువైందని, ఏ వేవ్, వేరియంట్ ఎప్పుడు వస్తుందో తెలియదని అన్నారు. ఏ రోగానికైనా కారణం తెలిస్తే నివారణ చేయొచ్చని.. కానీ, కరోనా వ్యాప్తికి కారణాలు గుర్తించలేకపోతున్నామన్నారు. ఈ మహమ్మారి విస్తరణకు గల కారణాలను క్రిటికల్ అనాలసిస్ చేయాలని, అందుకోసం ఈనెల 11,12,13 తేదీల్లో కరోనా ప్రభావిత జిల్లాల్లో అధికారులు పర్యటించాలని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ సంక్లిష్టంగా మారిందని, ఇది ఎప్పటికైనా అంతుచిక్కని సమస్యే అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా నివారణకు నిర్ధిష్టమైన అవగాహన కరువైందని, ఏ వేవ్, వేరియంట్ ఎప్పుడు వస్తుందో తెలియదని అన్నారు. ఏ రోగానికైనా కారణం తెలిస్తే నివారణ చేయొచ్చని.. కానీ, కరోనా వ్యాప్తికి కారణాలు గుర్తించలేకపోతున్నామన్నారు.
ఈ మహమ్మారి విస్తరణకు గల కారణాలను క్రిటికల్ అనాలసిస్ చేయాలని, అందుకోసం ఈనెల 11,12,13 తేదీల్లో కరోనా ప్రభావిత జిల్లాల్లో అధికారులు పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మనతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదన్నారు. రాష్ట్రంలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వరం సర్వే నిర్వహించాలన్నారు. ఇదివరకు నిర్వహించిన జ్వరం సర్వే విజయవంతమైందని కేసీఆర్ స్పష్టంచేశారు.
Next Story






