రైతుల వద్దకే ఏజెన్సీలు వెళ్లాలి..

by Shyam |

<p>దిశ,వెబ్ డెస్క్: రైతుల వద్దకే ఏజెన్సీలు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. వానా కాలం ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని అని అన్నారు. మార్కెట్లకు ధాన్యం తీసుకు వచ్చి రైతులు ఇబ్బందులు పడకూడదని అన్నారు. ఈ మేరకు మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంత ధాన్యం వస్తుందో అంచనా [&hellip;]</p>

రైతుల వద్దకే ఏజెన్సీలు వెళ్లాలి..
X

దిశ,వెబ్ డెస్క్: రైతుల వద్దకే ఏజెన్సీలు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. వానా కాలం ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని అని అన్నారు. మార్కెట్లకు ధాన్యం తీసుకు వచ్చి రైతులు ఇబ్బందులు పడకూడదని అన్నారు. ఈ మేరకు మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంత ధాన్యం వస్తుందో అంచనా వేసి ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం అమ్మిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని తెలిపారు. తాలు లేకుండా తెచ్చిన ధాన్యానికి ప్రభుత్వమే మద్దతు ధర చెల్లిస్తుందని వెల్లడించారు.

Next Story