మరికాసేపట్లో గవర్నర్‌తో సీఎం భేటీ

by B.Srinivas |

<p>దిశ, న్యూస్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపట్లో గవర్నర్‌తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్ పరిస్థితుల్లో రాష్ట్రంలోని తాజా పరిణామాలు, మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన తర్వాత పెరిగిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య&#8230; ఇలా అనేక విషయాలపై గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించనున్నారు. రాష్ట్రమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్నా పేదలకు, వలస కార్మికులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ఆమెకు వివరించనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని హోలీ [&hellip;]</p>

మరికాసేపట్లో గవర్నర్‌తో సీఎం భేటీ
X

దిశ, న్యూస్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపట్లో గవర్నర్‌తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్ పరిస్థితుల్లో రాష్ట్రంలోని తాజా పరిణామాలు, మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన తర్వాత పెరిగిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య… ఇలా అనేక విషయాలపై గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించనున్నారు. రాష్ట్రమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్నా పేదలకు, వలస కార్మికులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ఆమెకు వివరించనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని హోలీ పండుగ దగ్గరి నుంచి అన్ని అధికారిక కార్యకలాపాలను రద్దు చేసుకున్న గవర్నర్ రాజ్‌భవన్‌కు మాత్రమే పరిమితమయ్యారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత గవర్నర్‌తో ముఖ్యమంత్రి సమావేశం కాలేదు. ఇప్పుడు సమావేశం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించడం, గురువారం ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు వస్తున్న ఆదేశాలు, వాటిని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న తీరు తదితరాలను కూడా ఈ సందర్భంగా ఆమెతో పంచుకోనున్నారు. ఇండోనేషియాకు చెందినవారు కరీంనగర్‌లో పర్యటిస్తున్నసందర్భంగా పది మందికి పాజిటివ్ అని నిర్ధారణ కావడం, వారితో సన్నిహితంగా ఉన్న పలువురికి పాజిటివ్ రావడం, ఇటీవల ఢిల్లీలోని మర్కజ్ మసీదు పర్యటన అనంతరం రాష్ట్రంలో చాలా మందికి అది సోకడం, ఇప్పటివరకు చనిపోయిన ఆరుగురికీ మర్కజ్‌తో ఉన్న సంబంధం తదితరాలన్నింటినీ గవర్నర్‌కు వివరించనున్నట్లు సమాచారం.

Tags: Telangana, Governor, CM KCR, Meeting, Corona, Action taken

Next Story