- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Lock down: లాక్‌డౌన్‌పై మరి కాసేపట్లో కీలక ప్రకటన
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్‌డౌన్‌పై మరికాసేపట్లో కీలక ప్రకటన వెలువడనుంది. ప్రగతిభవన్ వేదికగా రాష్ట్ర మంత్రివర్గంతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి లాక్‌డౌన్, సడలింపు అంశాలపై చర్చలు జరుపనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకైతే కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్ కఠినంగానే అమలవుతోంది. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని వర్తక, వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత అత్యవసర […]</p>

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్‌డౌన్‌పై మరికాసేపట్లో కీలక ప్రకటన వెలువడనుంది. ప్రగతిభవన్ వేదికగా రాష్ట్ర మంత్రివర్గంతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి లాక్‌డౌన్, సడలింపు అంశాలపై చర్చలు జరుపనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకైతే కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్ కఠినంగానే అమలవుతోంది. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని వర్తక, వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి ఇవ్వడం లేదు. రోజులో 20 గంటలు లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఆదివారం వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. అయితే ఆదివారం తర్వాత ఏమిటీ..?, లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? లేదంటే కరోనా కేసులు తగ్గాయని సడలింపులు ఇస్తారా? అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి మండలి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.






