ఉద్యోగులకు తీపి కబురు.. పీఆర్సీపై వారంలో క్లారిటీ!

74

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఇన్నిరోజులుగా పీఆర్సీపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ఆదివారం ఆయన ఫుల్‌స్టాప్ పెట్టారు. ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ వెంటనే చర్చలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు.

ఇందులో భాగంగా పీఆర్సీ, ప్రమోషన్లు, ఉద్యోగులకున్న ఇతర సమస్యల పరిష్కారానికి సంబంధించి వారం, పదిరోజుల్లోగా చర్చలను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కాగా, త్రిసభ్య కమిటీలో సీఎస్ సోమేష్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..