- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కేసీఆర్ మరోసారి అత్యున్నత సమావేశం
by Shyam |
<p>కరోనా వైరస్ దృష్ట్యా తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌పై పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ మరోసారి అత్యున్నత సమావేశం కానున్నారు. అత్యవసరంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు, సీఎస్, డీజీపీ తదితరులు పాల్గొంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని ఈ […]</p>

X
కరోనా వైరస్ దృష్ట్యా తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌పై పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ మరోసారి అత్యున్నత సమావేశం కానున్నారు. అత్యవసరంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు, సీఎస్, డీజీపీ తదితరులు పాల్గొంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు.
Tags: CM KCR, once again, highest meeting, lockdown, telangana
Next Story






