కేంద్రం ఊరికే ఇవ్వడం లేదు.. జీఎస్టీ పేరుతో వసూల్: కేసీఆర్

by  |
కేంద్రం ఊరికే ఇవ్వడం లేదు.. జీఎస్టీ పేరుతో వసూల్: కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు, జీఎస్టీ పేరుతో భారీ మొత్తంలో వసూలు చేసి, అంతంత మాత్రంగానే తిరిగిచెల్లిస్తున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ఉపాధి హామీ నిధులను దారి మళ్లీస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ గ్రామ పంచాయతీలకు కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చే నిధులేమీ ఉండవని శాసనసభలో మరోసారి స్పష్టత ఇచ్చారు. ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచే రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయని.. ప్రత్యేకంగా ఇచ్చేదేమీ లేదన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎక్కువ నిధులు పోతున్నాయే కానీ కేంద్రం ఊరికే ఇవ్వడం లేదని, ట్యాక్సులు, జీఎస్టీ పేరుతో కేంద్రం తీసేసుకుంటున్నారని పేర్కొన్నారు.



Next Story

Most Viewed