ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తా.. కేసీఆర్ ఛాలెంజ్

by  |
KCR
X

దిశ, వెబ్‌డెస్క్: గొర్ల పైసలు కేంద్రమే ఇచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నిస్సిగ్గుగా చెప్పారని, గొర్ల పైసలు నిజంగా కేంద్రమే ఇచ్చి ఉంటే తాను ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. గొర్రెల పథకంలో కేంద్రం డబ్బులు ఒక్క రూపాయి కూడా లేదన్నారు. తెలంగాణ కోసం ఎన్నోసార్లు రాజీనామా చేసి మళ్లీ గెలిచానని, కేంద్రం సమాధానం చెప్పేంతవరకు వదిలిపెట్టమని, గొర్ల పథకానికి తాము ఎన్‌సీడీసీ నుంచి అప్పు తెచ్చుకున్నామన్నారు. గొర్ల పథకం బీజేపీది అయితే కర్ణాటకలో ఎందుకు లేదు? అని ప్రశ్నించారు.

‘ఒళ్లు దగ్గర పెట్టుకో మిస్టర్ బండి సంజయ్.. నా హద్దులు నాకు తెలుసు.. ప్రశ్నిస్తే ఐటీ దాడులు చేయిస్తారు. సంజయ్ మాటల్ని చూసి జనమంతా అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో మీరు ఒక్క జిల్లా పరిషత్ అయినా గెలిచారా? జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాకన్నా ఎక్కువ గెలిచారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి ఆ మాత్రం గెలిచారన్నారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు వదిలిపెట్టబోమన్నారు.

దళితున్ని సీఎం చేయకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. త్వరలో 70 వేల ఉద్యోగాలు



Next Story

Most Viewed