సచివాలయ డిజైన్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం..

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-05 05:43:00  IST  )

<p>దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొత్త సెక్రెటేరియట్ భవన డిజైన్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, విద్యారంగం పై చర్చ ఇంకా కొనసాగుతోంది. అలాగే, ఆయుష్ డాక్టర్ల వయోపరిమితి పెంపు, నియంత్రిత వ్యవసాయ విధానం అమలవుతున్నతీరుపై సీఎం సమీక్షించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది.. కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇంకా ఏపీతో జల [&hellip;]</p>

సచివాలయ డిజైన్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం..
X

దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొత్త సెక్రెటేరియట్ భవన డిజైన్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, విద్యారంగం పై చర్చ ఇంకా కొనసాగుతోంది.

అలాగే, ఆయుష్ డాక్టర్ల వయోపరిమితి పెంపు, నియంత్రిత వ్యవసాయ విధానం అమలవుతున్నతీరుపై సీఎం సమీక్షించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది.. కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇంకా ఏపీతో జల వివాదాలు, అపెక్స్ కౌన్సిల్ అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Next Story