- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోముల అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ముగిశాయి. నోముల స్వగ్రామమైన నల్గొండ జిల్లా జిల్లా నకిరేకల్ మండలం పాలెంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. నోముల అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం 11:30 గంటలకు పాలెం చేరుకుని, నోముల భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. నోముల అంత్యక్రియల్లో పాల్గొని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారిని పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ముగిశాయి. నోముల స్వగ్రామమైన నల్గొండ జిల్లా జిల్లా నకిరేకల్ మండలం పాలెంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. నోముల అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ గురువారం ఉదయం 11:30 గంటలకు పాలెం చేరుకుని, నోముల భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. నోముల అంత్యక్రియల్లో పాల్గొని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారిని పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు.
Next Story






