ప్రజలు సహకరించాలని ట్విట్టర్ వేదికగా కోరిన సీఎం కేసీఆర్

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ చికిత్స విషయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని సీఎం కేసీఆర్ ట్విట్టర్ వేదికగా కోరారు. కేంద్ర ప్రభుత్వం కొవిడ్ చికిత్సకు అవసరమైన ఆక్సిజన్, రెమిడిసివర్, టాసిలిజుమాబ్ వంటి మందులన్ని రాష్ట్రాలకు ఇంత కోటా అని అందజేస్తుందని, అవి తెలంగాణకు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. ఇప్పుడు తెలంగాణకు సరిహద్దులైన నాలుగు రాష్ట్రాల నుంచి కొవిడ్ పేషంట్లు హైదరాబాద్ కు వస్తున్నారని తెలిపారు. అయితే తమ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తెలంగాణ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కొవిడ్ రోగులకు కొన్ని నియమాలు పెట్టిందన్నారు. తెలంగాణకు అవసరమైన మందులు, ఆక్సిజన్ ను కేంద్రం వెంటనే పంపించాలని కోరారు.

కేసులు నమోదు అయ్యేది ఏపీ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్నాటకలు కానీ చికిత్స తీసుకునేది మాత్రం హైదరాబాద్ లో అన్నారు. తెలంగాణలో నమోదయ్యే కేసులకు సరిపడ మందులు, వ్యాక్సిన్లు ఇస్తున్న కేంద్రానికి ఇది తెలియదా? అని ప్రశ్నించారు. నిజనిజాలు దాచిపెట్టి కరోనా విషయంలో తెలంగాణ మీద దుమ్మెత్తిపోస్తున్న వారిని ఏమనాలి అని ప్రశ్నించారు.

వీరశైవులకు సీఎం శుభాకాంక్షలు

బసవేశ్వర్‌ జయంతి సందర్భంగా వీరశైవులకు సీఎం కేసీఆర్‌ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మనుషుల మధ్య అసమానతలను పెంచే కుల, వర్ణ, లింగ వివక్షలను వ్యతిరేకించిన బసవేశ్వరుడు అభ్యుదయవాదిగా, పాలానాధక్షుడిగా పేరొందారని గుర్తుచేశారు. వీరశైవ లింగాయత్‌ల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదని సీఎం తెలిపారు. ఎమ్మెల్సీ కవిత వీర శైవులకు బసవేశ్వర్‌ జయంతిని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.


Next Story

Most Viewed