- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించిన ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు , సిద్దిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించి, 74శాతం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం కేసీఆర్ ట్వీట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించి పార్టీకి తిరుగులేదని మరోమారు […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించిన ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు , సిద్దిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించి, 74శాతం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం కేసీఆర్ ట్వీట్ చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించి పార్టీకి తిరుగులేదని మరోమారు నిరూపించారని సీఎం పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీయే మా పార్టీ అని తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఇంతటి అద్భుత విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ ట్విట్టర్ వేదికగా సోమవారం ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు (వరంగల్, ఖమ్మం), ఐదు (సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు) మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం… 74% వార్డ్ లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. pic.twitter.com/e0ZoSQf5Ap
— TRS Party (@trspartyonline) May 3, 2021






