వణికిస్తున్న ఒమిక్రాన్‌పై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

by  |
jagan
X

దిశ, ఏపీ బ్యూరో: ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ‘అధికారులకు వ్యాక్సినేషన్‌ మరింత ఉధృతంగా చేయాలి. కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలి. టార్గెట్‌ పెట్టుకుని మరీ వ్యాక్సినేషన్‌ చేయండి. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజలు గుమిగూడకుండా చూడాలి. మాస్క్‌ విషయంలో మళ్లీ డ్రైవ్‌ చేయండి.. గతంలో ఉన్న నిబంధనలు అమలు చేయండి. క్రమం తప్పకుండా ఫీవర్‌ సర్వే జరగాలి.. డోర్‌ టూ డోర్‌ వ్యాక్సినేషన్, ఫీవర్‌ సర్వే రెండూ చేయండి. ఆక్సిజన్‌ పైప్‌లైన్లు సరిగ్గా ఉన్నాయా? లేవా? డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేదా చూసుకోండి. గతంలో కోవిడ్‌ చికిత్స కోసం వాడుకున్న అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా.. లేవా.. సరిచూసుకోండి. ఎంప్యానల్‌ ఆసుపత్రులలో వసతులు సరిగా ఉన్నాయా లేదా చూసుకోండి. క్వారంటైన్‌ సెంటర్స్, కోవిడ్‌ కేర్‌ సెంటర్స్, కోవిడ్‌ కాల్‌ సెంటర్‌లను తిరిగి పరిశీలించండి. ఏ అనారోగ్య సమస్య ఉన్నా 104కు కాల్‌ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్‌లను, లైన్‌ డిపార్ట్‌మెంట్‌లను సిద్ధం చేయండి’ అని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.


Next Story