ఈ రెండ్రోజులు సీఎం బిజీ బిజీ.. ఆయా జిల్లాల పర్యటన ఖరారు..

by  |
Jagan
X

దిశ, వెబ్ డెస్క్: వర్షాలకు అతలాకుతలం అయిన నెల్లూరు, కడప, చిత్తురు లలో శుక్రవారం సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను సీఎం కార్యాలయం విడుదల చేసింది.

గురువారం నాడు ఆయా జిల్లాల్లోని రైతులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటారు. తర్వాత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం తిరుపతి లోని పద్మావతి అతిథి గృహంలో రాత్రికి విశ్రాంతి తీసుకుంటారు. శుక్రవారం రోజు పెన్నానదీ పరివాహక ప్రాంతాలను పరిశీలిస్తారు. పంటల నష్టం పై అధికారులతో చర్చిస్తారు. సహాయ శిబిరాల్లో ఉంటున్న బాధితులతో మాట్లాడుతారు. అనంతరం రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళతారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటారు.

సీఎం షెడ్యూల్ ఇలా..
గురువారం ఉదయం 9.20 కి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 10.15 కి కడప కు చేరుకుంటారు. 11.10 కి పలపుత్తూరు కి చేరుకుని అక్కడ వరద సహాయ చర్యలు ఎలా జరిగాయో బాధితులను అడిగి తెలుసుకుంటారు. తర్వాత సులసుత్తూరు సచివాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 కి ఎగువ మదనపల్లె కి వెళ్తారు. 2.15 నుంచి 2.45 వరకూ జిల్లాలో జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. తర్వాత రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లి లోని తన నివాసానికి వెళతారు.


Next Story

Most Viewed