కాన్వాయ్ ఆపించిన జగన్… ఎందుకంటే?

by Vadlamudi Anukaran |   (  Updated:2023-08-18 16:14:23  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ కాన్వాయ్ అంబులెన్స్‌కు దారిచ్చింది. పులివెందుల నుంచి తిరిగి వచ్చిన సీఎం… గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి-నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా… కాన్వాయ్ ఆపించి ఆ అంబులెన్స్‌కు దారి ఇప్పించారు జగన్. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్ ‌పై వెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి.. ఉషారామ ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా… దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి […]</p>

కాన్వాయ్ ఆపించిన జగన్… ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ కాన్వాయ్ అంబులెన్స్‌కు దారిచ్చింది. పులివెందుల నుంచి తిరిగి వచ్చిన సీఎం… గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి-నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా… కాన్వాయ్ ఆపించి ఆ అంబులెన్స్‌కు దారి ఇప్పించారు జగన్.

ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్ ‌పై వెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి.. ఉషారామ ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా… దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

Next Story
null