Chief Minister Jagan Mohan Reddy : తుఫాన్ ఎఫెక్ట్.. కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-05-25 04:07:32  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీపై యాస్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనున్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో యాస్ తుఫాన్‌పై విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ (Chief Minister Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా సీఎస్ ఆదిత్యానాథ్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న పరిస్థితులను సీఎం జగన్‌కు వివరించారు. ఇప్పటి [&hellip;]</p>

Chief Minister Jagan Mohan Reddy : తుఫాన్ ఎఫెక్ట్.. కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీపై యాస్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనున్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో యాస్ తుఫాన్‌పై విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ (Chief Minister Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ ఆదిత్యానాథ్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న పరిస్థితులను సీఎం జగన్‌కు వివరించారు. ఇప్పటి వరకు అక్కడక్కడా చిరజల్లులు తప్పించి తుఫాన్ ప్రభావం పెద్దగా లేదని సీఎస్ తెలిపారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని సీఎంకు సీఎస్ చెప్పారు. విజయనగరం జిల్లాలోనూ ఇంకా తుఫాన్ ప్రభావం లేదని సీఎంకు కలెక్టర్ జవహర్ వెల్లడించారు. కొవిడ్ రోగులకు 4 రోజులకు సరిపడా మందులు పంపించామని కలెక్టర్ తెలిపారు.

Next Story