- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పలు కీలక అంశాలపై సీఎం జగన్ సమీక్ష..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అమరావతి క్యాంపు ఆఫీసులో పలు కీలక అంశాలపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు.దీనికి ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విశాఖలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ వర్శిటీ ఏర్పాటు కావాలన్నారు. స్వదేశీ, విదేశీ ఐటీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అంశాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు శిక్షణా, ఉపాధి లభించేలా చూడాలని కోరారు. ఏటా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అమరావతి క్యాంపు ఆఫీసులో పలు కీలక అంశాలపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు.దీనికి ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విశాఖలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ వర్శిటీ ఏర్పాటు కావాలన్నారు. స్వదేశీ, విదేశీ ఐటీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అంశాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు శిక్షణా, ఉపాధి లభించేలా చూడాలని కోరారు. ఏటా కనీసం 2వేల మందికి విశాఖ సంస్థలో శిక్షణ ఇవ్వాలని వెల్లడించారు. ఐటీలో డిగ్రీ లేదా డిప్లమా కోర్సులు కూడా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు సంబంధించి భూ సేకరణపై దృష్టి సారించాలని అధికారులను అదేశించారు.
Next Story






