- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనం అల్లూరి’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: సాయుధ పోరాట యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్య పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని సీఎం జగన్ ట్విటర్ వేదికగా కొనియాడారు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నట్లు సీఎం జగన్ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: సాయుధ పోరాట యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్య పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని సీఎం జగన్ ట్విటర్ వేదికగా కొనియాడారు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారిలో మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజులు ఉన్నారు.
Next Story






