ఆ కేంద్రమంత్రితో సీఎం జగన్ భేటీ..

by  |
ఆ కేంద్రమంత్రితో సీఎం జగన్ భేటీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి పయనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయమై చర్చించేందుకు కేంద్రమంత్రితో సమావేశమైనట్లు సమాచారం.

అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను జగన్ కలువనున్నారు. పోలవరం ప్రాజెక్టు బకాయిల అంశాన్ని షెకావత్‌తో చర్చించనున్నారు. తరువారం రాత్రి 9 గంటలకు జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై పలు అంశాలపై ముచ్చటించనున్నారు. రేపు ఉదయం 11గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో జగన్ భేటీకానున్నారు.

Next Story

Most Viewed