అమ్మఒడి ప్రారంభం.. స్కూల్‌కి వెళ్లకపోతే మెసేజ్‌లు: జగన్

by  |
అమ్మఒడి ప్రారంభం.. స్కూల్‌కి వెళ్లకపోతే మెసేజ్‌లు: జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే 44.48 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 6,673 కోట్ల జమ చేస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుతోందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో గణనీయంగా సంఖ్య పెరిగిందని గుర్తు చేశారు.

పేద పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలనేదే అమ్మ ఒడి ముఖ్య ఉద్దేశమన్నారు. పాదయాత్రలో పేద విద్యార్థుల కష్టాలను దగ్గర నుంచి చూశానని.. అందుకే విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. గత పాలకులు విద్యను నిర్లక్ష్యం చేశారని జగన్ విమర్శలు చేశారు. నాడు-నేడుతో ప్రభుత్వ రూపురేఖలు మార్చామని.. విద్యార్థులు స్కూల్‌కి రాకపోతే తల్లిదండ్రులకు మేసెజ్ వస్తోందన్నారు. ఇక రెండో రోజు కూడా గైర్హాజరు అయితే వాలంటీర్ ఇంటికి వచ్చి ఆరా తీస్తాడని సీఎం స్పష్టం చేశారు. ఇక 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు అమ్మఒడి బదులు.. ల్యాప్‌టాప్‌లు ఇస్తామని చెప్పారు. అమ్మఒడి వద్దనుకుంటేనే ల్యాప్‌టాప్‌లు తీసుకోవచ్చని సూచించారు.



Next Story

Most Viewed