ఏపీ అభివృద్ధికి స్పెషల్‌ స్టేటస్ ఉండాల్సిందే : సీఎం జగన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్ :  భారత ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ పాలకమండలి భేటీ శనివారం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ మీట్లో దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా ఏపీ ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు. అలా అయితేనే రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా సాధ్యమవుతుందన్నారు. అలాగే పోలవరానికి ప్రకటించిన జాతీయ హోదా ప్రకారం.. [&hellip;]</p>

cm jagan
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ పాలకమండలి భేటీ శనివారం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ మీట్లో దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా ఏపీ ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు. అలా అయితేనే రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా సాధ్యమవుతుందన్నారు.

అలాగే పోలవరానికి ప్రకటించిన జాతీయ హోదా ప్రకారం.. దానిని త్వరగా పూర్తి చేయడానికి కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలన్నారు. గతంలోనూ సీఎం జగన్ ఈ విషయాన్ని నీతి అయోగ్ కమిటీ ముందు పెట్టగా వారి నుంచి స్పందన కరువైంది. తాజాగా మరోసారి ఈ అంశాన్ని జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించగా.. పాలకమండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

Next Story