తెలుగు ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు

by  |
cm jagan
X

దిశ, ఏపీ బ్యూరో: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సీఎం వైఎస్ ​జగన్మోహన్‌రెడ్డి ​శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు మనమిచ్చే గౌరవానికి, మనకంటూ ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీకని ఆయన అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని విధంగా గత 19నెలలుగా మన రైతన్న సంక్షేమానికి, మన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. ఇకమీదట ఇదే విధానం కొనసాగుతుందని సీఎం జగన్​ ఉద్ఘాటించారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చని కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకొచ్చాయన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతీ కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని సీఎం జగన్​ అభిలషించారు.



Next Story