నర్సాపురం ప్రేమోన్మాది ఘటనపై సీఎం జగన్ ఆరా..

109
cm jagan

దిశ, వెబ్‌డెస్క్ : మరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ప్రియురాలు అనూషను, విష్ణువర్ధన్ రెడ్డి అనే యువకుడు దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా పోలీసు‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ఈ ఘటన గుంటూరు జిల్లా నర్సాపురంలో వెలుగులోకి రాగా.. ముఖ్యమంత్రి జగన్ ఈ హత్య ఉదంతంపై స్పందించారు. బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు నిందితుడిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి తగిన శిక్ష పడేలా చూడాలన్నారు. అంతకుముందు అనూష మృతి పట్ల సీఎం జగన్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..