- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు…
<p>దిశ, దుబ్బాక : వెనుకబడ్డ దుబ్బాకను అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానంటే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట్, తాళ్లపల్లి, నగరం తదితర గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…. ఏ గ్రామానికి తాను వెళ్లినా అపూర్వ స్పందన కనబడుతోందని అన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలు […]</p>

దిశ, దుబ్బాక : వెనుకబడ్డ దుబ్బాకను అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానంటే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట్, తాళ్లపల్లి, నగరం తదితర గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…. ఏ గ్రామానికి తాను వెళ్లినా అపూర్వ స్పందన కనబడుతోందని అన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. ఎటు చూసినా ముత్యంరెడ్డి చేసిన పనుల గురించే చెప్పుకొస్తున్నారని అన్నారు. ముప్పై అయిదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి ఆస్తి పాస్తులను ముత్యంరెడ్డి సంపాదించుకోలేదనీ, పేద ప్రజల కోసమే ఎప్పుడు ఆలోచించే వారని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించే టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలంటే, ముత్యం లాంటి మీ అభిమాన నాయకుడు ముత్యంరెడ్డి ఆశయాలు తీరాలంటే చేతి గుర్తు కు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు.






