రాష్ట్ర సమస్యలపై సీఎం ధర్నా..!

by  |
రాష్ట్ర సమస్యలపై సీఎం ధర్నా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్ రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా అక్కడ విద్యుత్, నిత్యావసర వస్తువుల సంక్షోభం నెలకొంది. రాష్ట్రానికి సరిపడా విద్యుత్‌ను కేంద్ర గ్రిడ్స్ అందించడం లేదని, అది కాస్త వ్యవసాయ రంగం, పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోందని పంజాబ్ సీఎం అమరీందర్ అన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సమయం ఇవ్వాలని కోరగా ఆయన స్పందించలేదని చెప్పారు.

దీంతో రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం మరియు క్లిష్టమైన నిత్యావసర పరిస్థితుల సమస్యలను ఎత్తిచూపేందుకు తమ ఎమ్మెల్యేలు తలపెట్టిన ‘రిలే ధర్నా’కు నాయకత్వం వహిస్తానని సీఎం అమరీందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.



Next Story

Most Viewed