- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓయూ మెడికల్ కాలేజ్ మెస్‌లు మూసివేత
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజ్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెస్‌లు మూత పడ్డాయి. 296మంది వైద్య విద్యార్థులు కాలేజీ వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తుండగా ఇటీవల ఓ విద్యార్థి కరోనా బారిన పడటంతో అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే వైరస్ వ్యాప్తికి మెస్‌లు కారణమయ్యే అవకాశం ఉండడంతో మూసివేశారు. బాలికల మెస్‌ను వారం క్రితమే మూసివేయగా బాలుర మెస్‌కు తాజాగా తాళం వేశారు. ప్రస్తుతం కాలేజ్‌లో ఉన్న క్యాంటీన్‌ను మాత్రం యథావిధిగా […]</p>

X
దిశ, హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజ్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెస్‌లు మూత పడ్డాయి. 296మంది వైద్య విద్యార్థులు కాలేజీ వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తుండగా ఇటీవల ఓ విద్యార్థి కరోనా బారిన పడటంతో అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే వైరస్ వ్యాప్తికి మెస్‌లు కారణమయ్యే అవకాశం ఉండడంతో మూసివేశారు. బాలికల మెస్‌ను వారం క్రితమే మూసివేయగా బాలుర మెస్‌కు తాజాగా తాళం వేశారు. ప్రస్తుతం కాలేజ్‌లో ఉన్న క్యాంటీన్‌ను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. క్యాంటీన్ నిర్వాహకులకు కరోనా పరీక్షలు చేశామని, వారిపై వైరస్ ప్రభావం లేకపోవడంతో క్యాంటీన్ కొనసాగించేందుకు అనుమతినిచ్చామని ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డి తెలిపారు.
Next Story






