- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పై నుంచి లారి వెళ్లి క్లీనర్ మృతి
<p>దిశ, పటాన్ చెరు: నిద్రిస్తున్న క్లీనర్ పైనుంచి లారీ వెళ్లడంతో క్లీనర్ మృతి చెందిన ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా హుమ్నాబాద్ కు చెందిన కిషన్(38) లారీ క్లీనర్ గా పని చేస్తున్నాడు. డ్రైవర్ ప్రకాశ్ మైత్రే తో కలిసి ముంబై నుంచి మండలంలోని ఇస్నాపూర్ శివారులో గల డీ మార్ట్ గోదాముకు శుక్రవారం మధ్యాహ్నం లోడుతో వచ్చారు. అన్ లోడ్ కాకపోవడంతో […]</p>

దిశ, పటాన్ చెరు:
నిద్రిస్తున్న క్లీనర్ పైనుంచి లారీ వెళ్లడంతో క్లీనర్ మృతి చెందిన ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా హుమ్నాబాద్ కు చెందిన కిషన్(38) లారీ క్లీనర్ గా పని చేస్తున్నాడు. డ్రైవర్ ప్రకాశ్ మైత్రే తో కలిసి ముంబై నుంచి మండలంలోని ఇస్నాపూర్ శివారులో గల డీ మార్ట్ గోదాముకు శుక్రవారం మధ్యాహ్నం లోడుతో వచ్చారు. అన్ లోడ్ కాకపోవడంతో రాత్రి గోదాములోనే ఉన్నారు. లారీ పక్కన క్లీనర్ కిషన్ నిద్రపోయారు. మధ్యరాత్రిలో అన్ లోడ్ చేసేందుకు క్లీనర్ ప్రకాశ్ ను నిద్ర లేపకుండానే లారీని డ్రైవర్ ప్రకాశ్ మైత్రే తీసుకుని వెళ్ళాడు. కాగా నిద్రిస్తున్న క్లీనర్ పై నుంచి మరో లారీ చూసుకోకుండా వెళ్లడంతో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ఎస్ఐ రామనాయుడు దర్యాప్తు చేస్తున్నారు.






