- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్, బీజేపీ నేతల బాహాబాహి
<p>దిశ, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్ మెట్ డివిజన్‌లో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పాటు బాహాబాహికి దిగారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ జరుగుతుండగా ప్రజలను టీఆర్ఎస్ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అది కాస్త చిలికి చిలికి గాలి వాన అన్నట్లుగా ఇరు పార్టీల నాయకులు తన్నుకునే పరిస్థితికి దారి తీసింది. దీంతో రాంనగర్ […]</p>

దిశ, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్ మెట్ డివిజన్‌లో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పాటు బాహాబాహికి దిగారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ జరుగుతుండగా ప్రజలను టీఆర్ఎస్ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అది కాస్త చిలికి చిలికి గాలి వాన అన్నట్లుగా ఇరు పార్టీల నాయకులు తన్నుకునే పరిస్థితికి దారి తీసింది.
దీంతో రాంనగర్ మీసేవ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు కలుగజేసుకొని ఇరు పార్టీల వారికి సర్ది చెప్పినప్పటికీ.. పోలీసుల ముందే నాయకులు ఘర్షణ పడటం చూసి ప్రజలు విస్తుపోయారు. ఓటమి భయంతోనే ప్రజలను టీఆర్ఎస్ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీజేపీ నాయకుడు ప్రకాశ్ గౌడ్ ఆరోపించారు. డివిజన్‌తో సంబంధం లేని నాయకులు, బయటి వ్యక్తులు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా పోలీసుల ముందే తనపై ప్రకాశ్ గౌడ్ దౌర్జన్యం చేశాడని టీఆర్ఎస్ నేత సుధాకర్ గుప్త ఆరోపించారు. అంతకుముందు టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని, ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ నేత ప్రకాశ్ గౌడ్‌లు టీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు.






