చై-సామ్ విడాకులకు నాగ్, అమలనే కారణమా.. డివోర్స్ ముందు జరిగింది ఇదేనా..!

by  |
samantha divorce
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసిన విషయం సమంత, నాగచైతన్య విడాకులు. వారిద్దరూ విడిపోతున్నారన్న వార్తను అభిమానులు అసలు జీర్ణించుకోలేక పోయారు. కానీ వారిద్దరూ అసలు ఎందుకు విడిపోయారు? అంతగా ప్రేమించుకున్న వారికేమైంది? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరి మెదళ్లలో గూళ్లు కట్టుకున్నాయి. కానీ వాటికి సమాధానం మాత్రం దొరకలేదు. విడాకుల విషయంలో సమంత, నాగచైతన్య కూడా మౌనం పాటించారు. దాంతో వీరిద్దరు విడాకుల గురించి ఇవే కారణాలంటూ అనేక వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో తాజాగా మరో వార్త నెట్టింట వినిపిస్తోంది. చై-సామ్ విడిపోవడానికి ఆ సినిమా సీన్లే కారణం అంటూ ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఆ వెబ్ సిరీస్‌లో బోల్డ్ సన్నివేశాలు చేసింది. ఆ సన్నివేశాలు అక్కినేని కుటుంబ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని అక్కినేని ఫ్యామిలీ భావించింది. అంతేకాకుండా వివాహం తర్వాత కూడా స్పెషల్ సాంగ్స్, బోల్డ్ సీన్స్ ఆపేందుకు సమంత నిరాకరించడమే కారణం అని తెలుస్తోంది. వీటిపై అక్కినేని కుటుంబం ఓసారి సమావేశం కూడా అయ్యారని, ఆ సమయంలో నాగార్జున, అమల, ఇతర అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ సమంతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని, కానీ సమంత మాత్రం వినలేదని, తనకు నచ్చిన పాత్రలు కచ్ఛితంగా చేస్తానని తేల్చి చెప్పిందట.

దీంతో ఆ సమస్యే చై-సామ్ విడాకులకు దారితీసిందని తెలుస్తోంది. ఈ విషయాన్నిప్రముఖ వెబ్‌సైట్ ‘బాలీవుడ్‌లైఫ్’ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే దీనిపై చైతన్య, సమంత మౌనంగానే ఉన్నప్పటికీ సమంత అక్కడక్కడా చిన్నచిన్న హింట్స్ ఇస్తూ వచ్చింది. తీరా ఓ ఇంటర్వ్యూలో చైతన్య దీనికి పరోక్షంగా సమాధానం ఇచ్చాడు. ‘నేను అన్ని రకాల పాత్రలు చేస్తాను. కానీ నా కుటుంబానికి, కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగితే చేయను’ అని చెప్పాడు. దీంతో చై-సామ్ విడాకులకు అసలు కారణం సమంత చేసిన బోల్డ్ పాత్రలే అని అర్థం అవుతోంది.

అందుకే ఎక్స్‌పోజింగ్ చేస్తున్నా అన్నారు.. సారా అలీఖాన్


Next Story