అనూహ్య పరిణామం.. జుబిన్ గార్గ్ మృతి కేసులో అతని సోదరుడు, అస్సాం డీఎస్పీ సందీపన్ గార్గ్‌ అరెస్ట్

by Malleboina Mahesh |

అస్సాం ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ గన నెల 19న సింగపూర్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే

అనూహ్య పరిణామం.. జుబిన్ గార్గ్ మృతి కేసులో అతని సోదరుడు, అస్సాం డీఎస్పీ సందీపన్ గార్గ్‌ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాం ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ గన నెల 19న సింగపూర్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మొదట ఆయన మ‌‌ృతికి ప్రమాదం కారణం అని భావించినా, కుట్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అస్సాం సీఎం బిశ్వ శర్మ గార్గ్ మృతదేహానికి రెండో పోస్టుమార్టం నిర్వహించి న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జుబిన్ గార్గ్ బంధువు అస్సాం డీఎస్పీ సందీపర్ గార్గ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో ఇప్పటికే గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ (Siddharth Sharma), అలాగే నిర్వాహకుడు సంకను మహంత (Shyamkanu Mahanta) లను అరెస్టు చేసి.. విచారించారు. ఈ కేసును ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడి ప్రత్యేక బృందం (SIT) విచారణ చేపట్టింది. మొదట ప్రమాదంలో చనిపోయాడని అంతా భావించినప్పటికీ.. సింగర్ జుబిన్ గార్గ్ కు విషం ఇచ్చి హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కోణంలోనే సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Next Story