‘సికిందర్’ నుంచి జోహ్రా జబీన్ సాంగ్ రిలీజ్..ఆకట్టుకుంటున్న లిరిక్స్(వీడియో)

by I. Sairam |   (  Updated:2025-08-02 15:22:48  IST  )

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(SALMAN KHAN), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(RASHMIKA MANDANNA) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికిందర్’(Sikindar).

‘సికిందర్’ నుంచి జోహ్రా జబీన్ సాంగ్ రిలీజ్..ఆకట్టుకుంటున్న లిరిక్స్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(SALMAN KHAN), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(RASHMIKA MANDANNA) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికిందర్’(Sikindar). ఎ ఆర్ మురుగదాస్(Murugadas) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కీరోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ మూవీలో సత్యరాజ్(Sathyaraj), శర్మాన్ జోషి(Sharman Joshi), ప్రతీక్ బబ్బర్(Pratheek Babbar) వంటి ప్రముఖులు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. అయితే మాస్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్(Posters), టీజర్స్(Teasers) సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ‘జోహ్రా జబీన్’(Johra Jabeen) సాంగ్‌ను సోషల్ మీడియా(Social Media) వేదికగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇక ఈ పాటకు సమీర్(Sameer) సాహిత్యం అందించగా, ప్రీతమ్(Preetham) స్వరాలు సమకూర్చారు. నకాష్ అజీజ్ ఆలపించారు. కాగా ఈ చిత్రం మార్చి 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఇక లిరిక్స్‌ను గమనించినట్లయితే.. ‘నీ అందం ముందు ప్రపంచం చిన్నబోయింది, నీ మీద నాకు ఉన్న ప్రేమ అధ్యాత్మికమైనది. నీలాంటి నవ్వుతున్న అమ్మాయిని నేనెప్పుడూ చూడలేదు.. నువ్వే నా దేవత, నీ కోసం నన్ను నేను త్యాగం చేసుకున్నాను అంటూ సాగుతున్న ఈ పాట లిరిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. యూత్‌ను ఫిదా చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్‌ను వినేయండి.

Click For Video....

Next Story