- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ‘యూత్’.. కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా ఫస్ట్ లుక్
త్వరలోనే ‘యూత్’ మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో కిరణ్ అబ్బవరం లాంచ్ చేశారు.

దిశ, సినిమా: కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ ‘యూత్’. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ‘యూత్’ మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో కిరణ్ అబ్బవరం లాంచ్ చేశారు. అనంతరం టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ ఘన విజయాన్ని అందుకుంది. అలాగే ఇలాంటి తరహా కంటెంట్ తోనే వచ్చిన లిటిల్ హార్ట్స్ కూడా పెద్ద సక్సెస్ దక్కించుకుంది. ఇప్పుడు తెలుగు ఆడియెన్స్‌కు కావాల్సిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్‌లో వస్తున్న "యూత్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అలాంటి వైబ్స్ క్రియేట్ చేస్తోంది.






