‘మీ నడుము బాగుంది మేడమ్’.. అభిమాని అన్న ఆ కాంప్లిమెంట్ నాకు బాగా నచ్చింది.. పవన్ కళ్యాణ్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఫస్ట్ మూవీనే మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది.

‘మీ నడుము బాగుంది మేడమ్’.. అభిమాని అన్న ఆ కాంప్లిమెంట్ నాకు బాగా నచ్చింది.. పవన్ కళ్యాణ్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఫస్ట్ మూవీనే మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ మెప్పిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. అలా గత ఏడాది ‘తంత్ర’(Tantra), ‘పొట్టేల్’(Pottel), ‘శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్’(Srikakulam Sherlock Holmes), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది.

అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా బోల్డ్ బ్యూటీ అరియానా(Ariyana) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోకు గెస్టుగా హాజరైంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇంటర్వ్యూలో భాగంగా అరియానా.. ‘మీ జీవితంలో ఎదురైన బెస్ట్, నాటీ కాంప్లిమెంట్’ ఏంటి అని అడుగగా.. దానికి అనన్య నాగళ్ల స్పందిస్తూ.. ‘ కెరీర్‌ ప్రారంభంలో ఇంకా అప్పటికీ పెద్దగా గ్లామర్‌ పాత్రలో నటించని సమయంలో ఓ షాప్‌ ఓపెనింగ్‌ వెళ్లాను.

ఆ సమయంలో ఓ అభిమాని ఎంతో ఆతృతగా నా వద్దకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చిన వెంటనే ‘మేడమ్‌ మీ నడుము చాలా బాగుంది’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ కామెంట్‌ వల్ల నాకు కోపం రాలేదు. పైగా ఆ కాంప్లిమెంట్ నాకు బాగా నచ్చింది’ అని అనన్య నాగళ్ల చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Next Story