- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్ బ్యూటీతో సాలీడ్ ఐటెం సాంగ్ చేయనున్న యంగ్ టైగర్.. హైప్ పెంచుతున్న న్యూస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘దేవర’(Devara) మూవీతో మనముందుకు వచ్చి మంచి విజయం సాధించాడు. కొరటాల శివ(Koratal Shiva) తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీతోనే ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం జాన్వీ రామ్ చరణ్(ram Charan) సరసన ‘ఆర్ సీ-16’(RC-16) మూవీలో నటిస్తోంది. ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ‘వార్-2’(War-2) సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. అయాన్ ముఖేర్జీ(Ayan Mukherjee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ కీ రోల్ ప్లే చేయనున్నాడు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలన్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం కోసం సీనీ ప్రియులతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వార్-2లో ఎన్టీఆర్‌తో ఓ మాస్ మసాల్ సాంగ్ చేపియాలని మేకర్స్ చూస్తున్నారట. ఇందులో భాగంగా అతని సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) అయితే బాగుంటుందని అనుకుంటున్నారట చిత్రబృదం. దీంతో ఇదే విషయం గురించి ఆమెను సంప్రదించగా ఆమె ఓకే చేసినట్లు సమాచారం.
అయితే ఆల్రెడీ ఎన్టీఆర్ ఎంట్రో సాంగ్‌తో పాటు ఇప్పుడు ఇది కూడా నెంబర్ వన్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్, శ్రద్ధా కాంబోలో రానున్న ఈ ఊరమాస్ ఐటెం సాంగ్ బాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటెం సాంగ్స్‌లో ఒకటిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






