- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివాజీ మూవీపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం.. హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్
టాలెంటెడ్ యాక్టర్ శివాజీ(Shivaji), బిందు మాధవి(Bindu Madhavi) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘దండోరా’(Dandora).

దిశ, వెబ్‌డెస్క్: టాలెంటెడ్ యాక్టర్ శివాజీ(Shivaji), బిందు మాధవి(Bindu Madhavi) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘దండోరా’(Dandora). మురళీకాంత్(Murali Kanth) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవదీప్(Navdeep), నందు(Nandu), రవికృష్ణ(Ravi Krishna), మనికా చిక్కాల(Manika Chikkala), మౌనికా రెడ్డి(Mounika Reddy), రాధ్య(Radhya), అదితి భావరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, కుల వివక్ష వంటి సున్నితమైన సామాజిక అంశాలతో తెరకెక్కిన దండోరా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా.. ‘ఇప్పుడే దండోరా (Dandora) సినిమా చూశాను. ఇది ఎంతో లోతైన, శక్తివంతమైన మరియు ఆలోచింపజేసే చిత్రం. శివాజీ, నవదీప్, నందు, రవి కృష్ణ, బిందు మాధవిలు తమ నటనతో సినిమా ఆద్యంతం అద్భుతంగా రాణించారు.
ఇంతటి బలమైన రచనతో, మన మూలాలకు దగ్గరగా ఉండే కథను ఎంతో చక్కగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్ గారికి నా హ్యాట్సాఫ్. ఇలాంటి గొప్ప ప్రయత్నాన్ని ప్రోత్సహించి, నిర్మించిన రవీంద్ర బెనర్జీ గారికి అభినందనలు. ఈ గొప్ప చిత్రంలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






