- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమా నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫొటోలు లీక్.. షాక్‌లో ఫ్యాన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) రీసెంట్‌గా ‘దేవర’(Devara) మూవీతో వచ్చి మంచి విజయం సాధించాడు.

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) రీసెంట్‌గా ‘దేవర’(Devara) మూవీతో వచ్చి మంచి విజయం సాధించాడు. కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మూవీతోనే ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జాన్వీ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న ‘ఆర్ సీ-16’(Rc-16)లో నటిస్తోంది.
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘వార్-2’(War-2) సినిమాతో బిజీగా ఉన్నాడు. అయాన్ ముఖేర్జీ(ayan Mukherjee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ నుంచి తాజాగా కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.
వార్ 2 సినిమా షూటింగ్ ముంబైలో జెట్ స్పీడ్‌తో జరుగుతుంది. తారక్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ షాక్ అయ్యింది. ఎంతో పగడ్బందీగా చేస్తున్న షూటింగ్ నుంచి ఫొటోలు లీక్ అవ్వడం ఇప్పుడు చిత్ర యూనిట్‌ను టెన్షన్ పెడుతుంది. ఇక వార్ 2 నుంచి లీక్ అయిన ఫొటోలను చూసి తారక్ అభిమానులు షాక్ అవుతూ.. సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరి సినిమా రిలీజ్‌కి ముందే ఎన్టీఆర్ లుక్స్ లీక్ అవ్వడం కొంత నిరాశ అనే చెప్పాలి.






