మరో కొత్త ప్రాజెక్ట్‌తో వచ్చేస్తున్న యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్..

by Chukka Sudharani |

మ్యాడ్ స్క్వేర్ మూవీస్‌తో యూత్ ఆడియెన్స్‌లో తనకుంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్.

మరో కొత్త ప్రాజెక్ట్‌తో వచ్చేస్తున్న యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్..
X

దిశ, సినిమా: మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్‌తో యూత్ ఆడియెన్స్‌లో తనకుంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్. తాజాగా ఈయన మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఇటీవల ఈ గర్ల్ ఫ్రెండ్‌తో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని, టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబోలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్క్రిప్ట్ అందజేయగా, నిర్మాత ఎస్ కేఎన్ ఫస్ట్ క్లాప్ ఇచ్చి మూవీ టీమ్‌కు తమ బెస్ట్ విషెస్ అందించారు. ఓ సరికొత్త ట్రెండీ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.3 గా ఈ సినిమా నిర్మాణం కానుంది. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

Next Story