- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
D-55 ప్రాజెక్టులో భాగమైన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.. ఫొటోస్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా ప్రజెంట్ ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘D55’ ఒకటి. ఈ మూవీకు అమరన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ సినిమాను గోపురం ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీలో స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుందట. దీనిపై అఫీషియల్‌గా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడంటూ మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్ చేసింది.
ఈ మేరకు అతనితో తీసుకున్న కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ‘నువ్వు ఒక అద్భుత పిల్లాడివి సాయి.. D55 కి సంగీత స్వరకర్తగా నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది.. నా సోదరుడు అయిన నిన్ను దేవుడు దీవించును.. ధన్యవాదాలు ప్రియమైన ధనుష్ సార్.. D55 సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.






