Chiranjeevi: త‌మ‌న్నా, కాజ‌ల్ లాంటి హీరోయిన్ల పేర్లు మ‌ర్చిపోయా !

by velandi.Saikiran |

కాజల్ అగర్వాల్, తమన్నా పేర్లు చెబితే తాను గుర్తించలేక పోయానని స్పష్టం చేశారట‌ మెగాస్టార్ చిరంజీవి.

Chiranjeevi: త‌మ‌న్నా, కాజ‌ల్ లాంటి హీరోయిన్ల పేర్లు మ‌ర్చిపోయా !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయనతో పాటు చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ కూడా దూసుకు వెళ్తున్నారు. అయితే, అలాంటి మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో పాలిటిక్స్ లోకి వెళ్లి పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇండస్ట్రీకి చాలా కాలం దూరమయ్యారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్లీ సినిమాలు చేయాల్సి వచ్చింది.

త‌మ‌న్నా, కాజ‌ల్ లాంటి హీరోయిన్ల పేర్లు మ‌ర్చిపోయా

ప్రస్తుతం ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు చిరంజీవి. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలోకి వెళ్లి, రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత, ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్ల పేర్లు మర్చిపోయినట్లు వెల్లడించారట‌. ముఖ్యంగా కాజల్ అగర్వాల్, తమన్నా పేర్లు చెబితే తాను గుర్తించలేక పోయానని స్పష్టం చేశారట‌. వాళ్ల గురించి అడిగి తెలుసుకున్నానని తెలిపారట‌.

ఇండస్ట్రీకి చాలా రోజులు దూరమైన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొందని వెల్లడించారు. గతంలోనే మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2025లో ఓ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారట. కాగా మొన్న సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రూ.350 కోట్లు వసూలు చేసింది.

Next Story