- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ యంగ్ హీరో ‘గ్యాంబ్లర్స్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్
టాలీవుడ్ యంగ్ సంగీత్ శోభన్(Sangeet Shoban) మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ సంగీత్ శోభన్(Sangeet Shoban) మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం హీరోగా మారిన ఆయన ఓ సినిమా చేస్తున్నారు. సంగీత్ శోభన్, కేఎస్‌కే చైతన్య(KSK Chaitanya) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘గ్యాంబ్లర్స్’. అయితే ఇందులో ప్రశాంతి చారులింగ(Prasanthi Charulinga)హీరోయిన్‌గా నటిస్తోంది. రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత కీలక పాత్రలో కనిపించనున్నారు. సునీత, రాజ్ కుమార్ బృందావనం అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిస్టరీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం థ్రిల్లింగ్, అంశాలు, ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ సినిమా.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన డబుల్ అప్డేట్స్‌ను చిత్రబృందం షేర్ చేసింది. ‘గ్యాంబ్లర్స్’ సినిమా జూన్ 6న థియేటర్స్‌లోకి రాబోతుందని వెల్లడించారు. అలాగే ఫష్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇక ఇందులో సంగీత్ శోభన్ వైట్ షర్ట్‌పై బ్లాక్ కోట్ ధరించి క్యాప్ ధరించి చేతిలో గన్ పట్టుకుని వెరైటీ లుక్‌లో కనిపించాడు. వెనకాల ఓ టేబుల్ ఉండగా..ఇరు వైపులా రెండు పెయింటింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం సంగీత్ శోభన్ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






