- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్‌తో క్యూట్ ఫొటోలు షేర్ చేసుకున్న యంగ్ హీరోయిన్.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇటీవల ఈ చిన్నది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu Kada) మూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Usthad Bhagat Singh) మూవీలో నటిస్తోంది. దీనికి హరీష్ శంకర్(Hareesh Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన రాశీ ఖన్నాతో పాటు శ్రీలీల(Sreeleela) కూడా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన అప్డేట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్- పవన్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలో తాజాగా రాశీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. షేర్ చేసిన పోస్ట్‌లో.. ‘ఉస్తాద్ భగత్ సింగ్ ముగియనున్న కొద్దీ, 2025 సంవత్సరం అర్థవంతంగా ముగుస్తుంది. ఈ సంవత్సరం నాకు ఇచ్చిన ప్రయాణం, ప్రజలు మరియు పాఠాలకు ధన్యవాదాలు. మంచి ప్రారంభాలకు చోటు కల్పించే ముగింపులు ఇక్కడ ఉన్నాయి’ అని కొన్ని మూవీ సీన్స్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. అందులో డైరెక్టర్ హరీష్ శంకర్‌తో పాటు పవన్ కళ్యాణ్‌తో సీన్స్ చేస్తున్న కొన్ని క్యూట్ ఫొటోస్‌ను షేర్ చేసింది. అలాగే అడవిలో షూట్ చేస్తున్న పిక్స్ కూడా షేర్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు, పవర్ స్టార్ ఫ్యాన్స్ సినిమా సీన్స్ ఫొటోస్ షేర్ చేసినందుకు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.






